Posts

స్థాయిని బట్టే అంచనా ఉంటుంది

Image
(శ్రీ రామకృష్ణ  పరమహంస  చెప్పిన గూడార్థ  కథలు) స్థాయిని  బట్టే  అంచనా  ఉంటుంది ఒకసారి  ఒక ఋషి  గాఢమైన  సమాధిస్థితిలో  ఒక త్రోవ  ప్రక్కనపడి  ఉన్నాడు.  ఒక దొంగ ఆ త్రోవలో  వెడుతూ, ఆ ఋషిని  చూసి ఇలా ఆలోచించాడు : " వీడు కూడా దొంగ అయి ఉంటాడు .  నిన్న రాత్రి  కొన్ని ఇళ్లలో  దొంగతనాలు చేసి అలిసిపోయి  ఇక్కడపడి  నిద్రపోతున్నాడు .  ఈపాటికి  పోలీసులు  వీడికోసం  వెతుకుతూ ఉండి  ఉంటారు. వాళ్ళు  వచ్చేలోపలే నేను పారిపోవడం మేలు!" అని  అనుకోని  ఆ దొంగ అక్కడ నుంచి  పారిపోయాడు.  కాసేపటి  తరువాత ఒక  త్రాగుబోతు  అక్కడికి  తూలుకుంటూ  వచ్చాడు. ఋషిని  చూసి, "ఏరా! త్రాగి  పడిపోయావా! నన్ను చూడరా! ఎంత  త్రాగినా  ఎలా నిలబడి  ఉన్నానో!" అన్నాడు. చివరిగా అక్కడికి ఇంకొక  సాధువు  వచ్చి ఒక గొప్ప  ఋషి  సమాధిస్థితిలో అక్కడ  పడివున్నాడని  గ్రహించాడు. ఆ ఋషి ప్రక్కనే కూర్చొని ఆయన పాదాలు వత్తడం ప్రారంభించాడు. ప్రాపంచిక సంస్కారాలు నిజమైన ఆధ్యాత్మికతను, పవిత్రతను గుర్తించకుండా చేస్తాయి .  పచ్చకామెర్ల  వాడికి  లోకమంతా  పచ్చగా  కనిపించినట్టుగా, ఒక మనిషి  ఏ  స్థాయిలో ఉంటే ఆ స్థాయిని  బట్టే ఎదుటివారిన